హెచ్-1బీ వీసాతో అమెరికా వెళ్లి అక్కడి వివిధ రంగాలలో అంటే విద్యా, ఉద్యోగం,వైద్యం, ఇలా ప్రతీ రంగంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రవాసీలు ఎంతో మంది ఉన్నారు.అయితే అగ్ర రాజ్యంలో ఉన్నా సరే హెచ్ -1 బీ వీసా దారులలో ఎంతో మంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారు లేకపోలేరు.
అలాంటి వారికోసమే అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం సరికొత్త విధానంతో హెచ్-1బీ వీసా దారులని ఆదుకోనుంది.
హెచ్ 1-బీ వీసా ఉన్న వారి పిల్లలకి కూడా ఉన్నత విద్యా సంస్థలలో ఉచిత విద్య కోసం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం చట్టం చేసింది.
ఈ చట్టాని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ ఈ బిల్లుపై సంతకం కూడా చేశారు.ఈ బిల్లు హెచ్ 1-బీ వీసా దారులకి ఆర్ధిక వెసులుబాటు ఇస్తుందని తెలిపారు.
ఈ బిల్లుపై భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికాలో ఒక పక్క ట్రంప్ విధానాలతో వలస చట్టాలు మరింత కటినతరం అవుతుంటే మరో పక్క ఈ ఉచిత విద్య కోసం న్యూజెర్సీ రాష్ట్రం కొత్త చట్టం అమలు చేయడంతో వలసవాసులు అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
న్యూజెర్సీ కి చెందిన ప్రతీ పౌరుడు తమ లక్ష్యాలని చేధించడానికి ఈ చట్టాలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.