ఓ తండ్రి తన కూతురికి దగ్గరుండి ప్రసవం చేసి పుట్టిన బిడ్డను గొంతు నులిమి కిరాతకంగా తలనరికి చంపి ఇంటి సమీపంలో ఉండే మురికి కాలువలో పడేసిన సంఘటన గుజరాత్ లోని పటాన్ జిల్లాలో చోటు చేసుకుంది.అసలు వివరాలు ఏమిటంటే.
గతంలో పటాన్ జిల్లాలో ఓ యువతి అత్యాచారానికి గురైంది.అప్పుడే పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే అత్యాచారానికి గురైన ఆ యువతి కొంత కాలానికి గర్భం దాల్చింది.
ఇక యువతికి నెలలు నిండడంతో.బయట ఎవరికి తెలియకుండా ఇంట్లోనే ఆ యువతకి ప్రసవం చేశాడు తండ్రి.పుట్టిన బిడ్డ ఏడిస్తే బయటి వాళ్లకి అంతా తెలిసిపోతుంది అని భావించి పుట్టిన పండంటి బిడ్డను గొంతు నులిమి, కత్తితో తల నరికి ఇంటి సమీపంలో ఉండే ఒక పెద్ద మురికి కాలువలో పడేసి చేతులు దులుపుకున్నాడు.
ఈ విషయం బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.కానీ గతంలో పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు అయింది.దీని కారణంగా యువతికి మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
గతంలో యువతిని పరీక్షించిన వైద్యులకు ఆమె గర్భంతో ఉందన్న విషయం తెలుసు.రెండోసారి వైద్య పరీక్షలు చేస్తే యువతి కడుపులో పిండం లేదనే విషయం బయటపడింది.ఏం జరిగిందని వైద్యులు ఆ యువతిని గట్టిగా నిలదీయడంతో తన తండ్రి చేసిన దారుణం బయట పెట్టేసింది.
ఆ యువతి ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు ఆ తండ్రిని అరెస్టు చేశారు.పుట్టిన బిడ్డపై కనీసం మానవత్వం లేకుండా కిరాతకంగా చంపిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
పోలీసులు అత్యాచారం చేసిన నిందితున్ని అప్పుడే అరెస్టు చేశామని తెలుపుతూ, తండ్రిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని తెలిపారు.