సభలో వ్యవసాయబిల్లులపై రణరంగమే నెలకొంది.సభలో విపక్షాల అరుపులు,కేకలు,నినాదాలతో సభ మొత్తం రసాభాస గా మారిపోయింది.
కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులతో ఆదివారంనాడు రాజ్యసభ హోరెత్తిపోయింది.దాదాపు మూడున్నర గంటలపాటు సభ రణరంగాన్ని తలపించింది.2010 మార్చి 9 న యూపీఏ సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఎలా మార్షల్స్ ను దింపి వ్యూహాత్మకంగా వ్యవహరించిందో దాదాపు అదే తరహా లో ఎన్డీయే సర్కార్ ఈ వ్యవసాయ బిల్లులపై వ్యవహరించింది.ఈ బిల్లులను అడ్డుకోవడానికి విపక్షాలు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ కేంద్రం మాత్రం మూజువాణి ఓటు మార్గాన్నే ఎంచుకుని ఓటింగ్‌కు అనుమతించలేదు.
సభలో బలం ఉన్నప్పటికీ ఎన్డీయే సర్కార్ మాత్రం మూజువాణి ఓటు మార్గం నే ఎన్నుకొని ఈ బిల్లులను పాస్ చేయడం లో విజయవంతమైంది.ఇది విపక్షాలకు తీవ్ర ఆగ్రహనికి కారణమైంది.
తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సభ మధ్యలోకి దూసుకొచ్చి- ఓ దశలో స్పీకర్ పోడియంపైకి కూడా ఎక్కడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో సభ నిర్వహిస్తున్న ఉపసభాపతి హరివంశ్‌దగ్గరకు – తృణమూల్ నేత డెరిక్ ఒబ్రెయిన్ వచ్చి సభా నియమాలకు సంబంధించిన పుస్తకాన్ని అటూ ఇటూ ఊపి- చించి, ఆయనపైకి విసిరేశారు.
అది హరివంశ్‌కు తగలకుండా మార్షల్స్ అడ్డుకున్నారు.ఇక డీఎంకే సభ్యుడు తిరుచి శివ– బిల్లు పత్రాల్ని చించేసి విసిరేశారు.
ఇలా ఆదివారం జరిగిన సభ రసాభాసగా మారింది.