ఎఫ్ 3 బ్రేక్ ఈవెన్ అవుతుందా.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3‘.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

 F3s First Week Collections Are Impressive, F3 Movie, Anil Ravipudi, Venkatesh, V-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా గత నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటించారు.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకు పోతుంది.గత శుక్రవారం రిలీజ్ అయినా ఈ సినిమా ఈ వారంతో సక్సెస్ ఫుల్ గా రెండవ వారంలోకి అడుగు పెట్టింది.

ఇక గత వారం రోజులుగా ఈ సినిమా 94 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.100 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా అడుగులు వేస్తుంది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ.41.06 కోట్ల షేర్ వసూలు చేయగా.వరల్డ్ వైడ్ గా 52.1 కోట్లు షేర్ రాబట్టినట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాదించాలి అంటే రెండవ వారంలో కూడా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా ఉండాలి.

Telugu Anil Ravipudi, Dil Raju, Fs, Varun Tej, Venkatesh-Movie

కాకపోతే ఈ రోజు థియేటర్ లలోకి మరికొన్ని సినిమాలు వచ్చాయి.మేజర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.అలాగే డబ్బింగ్ సినిమాలు అయినా కమల్ హాసన్ విక్రమ్, సుల్తాన్ పృథ్వీ రాజ్ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్ లలోకి వచ్చాయి.మరి ఈ సినిమాల ప్రభావం ఎంతో కొంత ఎఫ్ 3 సినిమాపై ఖచ్చితంగా ఉంటుంది.

మరి ఈ సినిమాలను తట్టుకుని ఎఫ్ 3 సినిమా వసూళ్ల జోరు చూపిస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube