భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు.మండలంలోని లక్ష్మిపురం వద్ద గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకోవడంతో ఎక్సైజ్ పోలీసుపై దుండగులు దాడికిపాల్పడ్డారు.
అయితే కానిస్టేబుల్ ప్రతిఘటించడంతో కారును అక్కడే వదిలి పరారయ్యారు.గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిపోయింది.దీంతో కారును వెంబడించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సలీం.
లక్ష్మీపురం వద్ద వారిని అడ్డుకున్నారు.రోడ్డుకు అడ్డంగా కారుపెట్టడంతో స్మగ్లర్లు అతడిపై దాడిచేశారు.
అనంతరం గంజాయితోపాటు తమ కారును అక్కడే వదిలి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్మగ్లర్ల కోసం గాలింపు ప్రారంభించారు.అయితే గంజాయి ఎంతమొత్తంలో ఉందనే విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది.