సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో అభిమానులు సెలబ్రిటీల మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది.అభిమానులకు సెలబ్రిటిలకు మధ్య దూరం తగ్గడంతో సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు.
సెలబ్రిటీలు కూడా వారి అభిమానాలతో వారికి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి ఆసక్తిని కనబరిస్తున్నారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు వారి అభిమానులతో తరచూ ముచ్చరించడంతో పాటు, వారికి సంబంధించిన ఎన్నో విషయాలను చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు.
అలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ వీడియోలో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన చిన్ననాటి ఫోటో లు అవుతోంది.
ఆ ఫోటో లో ఉన్న చిన్నారి చూడటానికి ఎంతో క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉంది.అలాగే ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం బాలీవుడ్ ని ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది.
మరి ఆ క్యూట్ గర్ల్ ఎవరో కాదు.దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.
ధడక్ సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.ఇప్పుడు మిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ప్రస్తుతం చేతి నిండా బోలెడు ప్రాజెక్టుతో బిజీబిజీగా గడుపుతోంది జాన్వికపూర్.
ఇకపోతే ఈమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలలో నటించాలని ఉంది అని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చాన్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు తన మనసులో మాటను బయట పెట్టేసింది జాన్వి కపూర్.