హీట్ రిలీఫ్ ఫ్యాన్ ఎలా క‌నిపెట్టారు? దీని చరిత్ర గురించి తెలిస్తే..

శీతాకాలం గడిచిపోయి వేసవి ప్రవేశించింది.ఈసారి మార్చి నెలలోనే వేడిగాలులు మొద‌ల‌య్యాయి.దీంతో ఏప్రిల్, మే, జూన్ గురించి త‌ల‌చుకుని బెంబేలెత్తిపోతున్నాం.ఎండాకాలం వచ్చిందంటే మ‌న‌ ప్రైమరీ ఫ్రెండ్ ఫ్యాన్ గుర్తుకువ‌స్తుంది.అయితే ఫ్యాన్‌ ఎలా క‌నిపెట్టార‌ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనిని ఎలా ఆధునికరించారు? ప్రస్తుత రూపం సంత‌రించుకుని ఇది అందుబాటులోకి ఎలా వచ్చింది? త‌దిత‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్ర‌స్తుతం విద్యుత్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, శతాబ్దాల క్రితం చెట్ల ఆకులతో ఫ్యాన్లు తయారు చేశారు.

 History Evolution Of Heat Relief Fan Details, Fan, Fan Evolution, Heat Relief F-TeluguStop.com

క్రీ.పూ.చెట్ల ఆకుల‌తో త‌యారు చేసిన ఫ్యాన్లు రాజులు, చక్రవర్తులకు గాలి అందించేందుకు సేవకులు ఉప‌యోగించేవారు.దీనికి మొదటి ఉదాహరణ ఈజిప్టులో ల‌భ్య‌మ‌య్యింది.

స్వీయ చోదక ఫ్యాన్ చైనాలో తొలిసారి క‌నుగొన్నార‌ని చ‌రిత్ర చెబుతోంది.అదే స‌మ‌యంలో మన దేశంలో కూడా హ్యాండ్ ఫ్యాన్ కనిపెట్టారు.ఇప్పుడు కూడా వృద్ధులు చేతితో దానిని తిప్పుతూ గాలిని పొందుతుంటారు.గ్రామాల్లో ఇలాంటి ఫ్యాన్లు కనిపిస్తుంటాయి.

విద్యుత్ ఆవిష్కరణకు మైఖేల్ ఫెరడే ఆద్యుడు.ఆ తరువాత థామస్ ఎడిసన్, నికోలా టెస్లా విద్యుత్తును ఆధునికరించడంతో పాటు వాటిని విస్తరించారు.1982లో షుయ్లర్ స్కాట్స్ వీలర్ మ‌నిషి అవ‌స‌రం లేకుండా ఫ్యాన్‌ను తిప్పడానికి విద్యుత్తును ఉపయోగించారు.

Telugu China, Egypt, Elctric Fan, Fan, Michael Faraday, Nikola Tesla, Thomas Edi

అప్పుడు విద్యుత్ ఫ్యాన్‌కు రెండు బ్లేడ్‌లు మాత్రమే ఉండేవి.ఇది ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్ మాదిరిగా ఉండేది.సీలింగ్ ఫ్యాన్లు 1889 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చాయి.

దీనికి ఫిలిమ్ హెచ్ డీహ్లీ పేటెంట్ పొందారు.ఇది ఒక పెద్ద మందపాటి ఇనుప కడ్డీని కలిగి ఉండేది, దాని బరువు చాలా ఎక్కువగా ఉండేది.

ప్రారంభంలో 4 బ్లేడ్‌లు క‌లిగిన ఫ్యాన్లు ఉండేవి.ఈ ఫ్యాన్లు ఈనాటిలా అంత వేగంగా తిరిగేవి కాదు.కానీ నెమ్మదిగా ఫ్యాన్ల‌లో అనేక మార్పులు సంత‌రించుకున్నాయి.1902లో ఫ్యాన్‌లను తయారు చేసే కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చాయి.దీంతో అందరి ఇళ్ల‌లో ఫ్యాన్లు ఒక భాగంగా మారిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube