ఎంప్లాయ్స్ కు ఎలన్ మస్క్ వార్నింగ్.. రండి, లేకపోతే మానేయండి!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది.ఉద్యోగుల విషయంలో ఆయన వైఖరి కఠినంగా ఉంటుందని మస్క్‌తో గతంలో పనిచేసిన వ్యక్తులు చెబుతుంటారు.

 Elon Musk Mails Tesla Executives To Return To Office Or Quit Job Details, Warni-TeluguStop.com

తాజాగా, వర్క్ ఫ్రమ్ హోం విషయంలో కటువుగా మెయిల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.

లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్.ఆఫీసుకు రాలేమంటే కనుక ఇకపై ఇంటికే పరిమితం కావొచ్చని హెచ్చరించారు.

ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపించారు.

కోవిడ్ నేపథ్యంలో చాలా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే.

టెస్లా ఉద్యోగులుల్లో కూడా కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.వీరిలో కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు.వాళ్లను ఆఫీసుకు వచ్చి పని చేయాలని ఎలన్ మస్క్ ఎప్పట్నుంచో కోరుతున్నారు.అయితే, ఇంకా చాలా మంది ఆఫీసుకు రాకుండా ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

అసలు వాళ్లు ఆఫీసుకు వస్తారా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది.ఈ నేపథ్యంలో డైరెక్టుగా ఎలన్ మస్క్ రంగంలోకి దిగాడు.

కంపెనీ ఎగ్జిక్యూటివ్స్‌కు గట్టి వార్నింగ్ ఇస్తూ నేరుగా మెయిల్స్ పంపుతున్నాడు.

Telugu Elon Musk, Elon Musk Mails, Employees, Quit Job, Return, Tesla Employees,

ఇంటి నుంచి పనిచేయడం ఇక నుంచి కుదరదని, అది ఆమోదయోగ్యం కూడా కాదని ఆ ఈ-మెయిల్స్‌లో పేర్కొన్న మస్క్. ఒకవేళ ఎవరైనా వర్క్ ఫ్రం హోం చేయాలని అనుకున్నా వారానికి 40 గంటలు కార్యాలయంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.అది కూడా కుదరదనుకుంటే కనుక భేషుగ్గా ఉద్యోగాన్ని వదులుకోవచ్చని పేర్కొన్నారు.

ఆఫీసు అంటే అది ప్రధాన కార్యాలయమేనని, విధులకు సంబంధం లేని ఇతర బ్రాంచీ కాదని మస్క్ తేల్చి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube