వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని, హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు శ్రీకారం చుట్టారు.ఈ మార్పు చేర్పుల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తప్పించారు.
మరి కొంతమందికి ఇతర నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు.తనకు అత్యంత సన్నిహితులైన వారిని పక్కన పెట్టారు.
గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు.ఇప్పటికి 7 విడతలుగా వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
దీంట్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.తాజాగా ఏనిమేదో విడత అభ్యర్థుల జాబితాను వైసిపి విడుదల చేసింది.

దీంట్లో కిలారు రోసయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళిని నియమించింది.ఈయన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు.గతంలో ఎంపీ అభ్యర్థిగా అనుకున్న ఉమారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారు రోశయ్య( Kilari Venkata Rosaiah )కు అవకాశం కల్పించింది.అలాగే కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ ( Burra Madhusudan )పేరును ఖరారు చేశారు.
అలాగే గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థిని మార్చారు.ఇక్కడ సెట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంటుకు పంపిస్తూ మార్పు చేశారు.
చిత్తూరు పార్లమెంట్ నుంచి పోటీకి విముఖత చూపడంతో తిరిగి గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేశారు.

నారాయణస్వామి కాకుండా ఆయన కుమార్తె కు టికెట్ కేటాయించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు కొత్త అభ్యర్థిగా కలత్తూరు కృపా లక్ష్మిని నియమించింది.అయితే జగన్ చేపట్టిన ఈ మార్పు చేర్పుల వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగానే మారింది.కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమను పక్కన పెట్టడంపై తీవ్ర అసంతృప్తికి గురవడం, టికెట్ దక్కని నేతలంతా ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నా.
అవి ఏమి పట్టించుకోనట్టుగానే వైసిపి అధిష్టానం వ్యవహరిస్తోంది.
.