విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉన్న ఒకేఒక్క ప్లేయర్ ఎవరో తెలుసా..?

భారత జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఎవరికి సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేయడం, పాత రికార్డులను బద్దలు కొట్టడంలో తనకు తానే సాటి.తాజాగా తన పుట్టినరోజు నాడే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను సమం చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

 Do You Know Who Is The Only Player Who Can Break Virat Kohli's Record Of Centuri-TeluguStop.com

em>సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) తన వన్డే కెరియర్ లో 49 సెంచరీలు బాదాడు.ఈ రికార్డును కొట్టే వాళ్లే లేరని అభిమానులంతా భావించారు.

కానీ 12 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఆ రికార్డును బ్రేక్ చేసేసాడు.దీంతో వన్డేలలో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండుల్కర్ రెండవ స్థానానికి చేరాడు.

తాజాగా విరాట్ కోహ్లీ 49 సెంచరీలతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.రోహిత్ శర్మ 31 సెంచరీలతో మూడవ స్థానంలో ఉన్నాడు.

తరువాతి స్థానాలలో ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ 30, శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య 28, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హెచ్.ఆమ్లా 27 సెంచరీలతో ఉన్నారు.

Telugu David, Quinton De Kock, Rohit Sharma, Tendulkar, Shubman Gill, India, Vir

ఈ ప్లేయర్ రిటైర్డ్ అయ్యారు కాబట్టి విరాట్ కోహ్లీ ఈ తాజా రికార్డును బద్దలు కొట్టే అవకాశం లేదు.ప్రస్తుతం ఫామ్ లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 22( David Warner ), సౌత్ ఆఫ్రికా ఓపెనర్ డికాక్ 22 సెంచరీలతో ఉన్నారు.ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.కాబట్టి వీళ్లు కూడా విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యమే.

ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్లలో ఒకడైన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం 19 సెంచరీలతో ఉన్నాడు.ప్రస్తుతం బాబర్ ఆజాం వయస్సు 29 ఏళ్లు.మరో ఐదేళ్ల వరకు క్రికెట్లో కొనసాగిన ఓ 35 సెంచరీల వరకు చేరొచ్చు కానీ విరాట్ కోహ్లీ రికార్డును మాత్రం బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.

Telugu David, Quinton De Kock, Rohit Sharma, Tendulkar, Shubman Gill, India, Vir

ప్రస్తుతం ఈ లెక్కలన్నీ చూస్తే.ఇప్పట్లో విరాట్ కోహ్లీ 49 వన్డే సెంచరీల రికార్డ్ బ్రేక్ చేయడం ఎవరికి సాధ్యం కాదు.కానీ కోహ్లీ రికార్డును భారత జట్టుకు చెందిన ఓ ప్లేయర్ కు బ్రేక్ చేసే అవకాశం ఉంది.

ఆ ప్లేయర్ మరెవరో కాదు భారత జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్( Shubman Gill ) ఈ యువ క్రికెటర్ ఆడిన 35 మ్యాచ్లలో ఆరు సెంచరీలు నమోదు చేశాడు.ఇతనికి దాదాపుగా పదేళ్లకు పైగా క్రికెట్ కెరీర్ ఉంది.

ఇప్పటినుంచే అదే ఫామ్ లో కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube