నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోయిన్ గా హిందీ తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలకు వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తన టీమ్ మొత్తాన్ని తన ఫ్యామిలీగా భావించే రష్మిక తన అసిస్టెంట్ పెళ్లి ( Assistant Marriage ) కావడంతో స్వయంగా ఆ పెళ్లి వేడుకలకు హాజరై సందడి చేశారు అలాగే నూతన వధూవరులను కూడా ఆశీర్వదించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక ఆరెంజ్ రంగు చీర ధరించిన సంగతి తెలిసిందే.ఇక ఈ చీర చూడటానికి సింపుల్ గా ఉన్న రష్మిక మాత్రం చాలా స్టైలిష్ గా కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనిత డుంగ్రే డిజైన్ చేశారని తెలుస్తోంది.ఇలా రష్మిక సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఈ చీర గురించి ఒక సీక్రెట్ రష్మిక సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.ఈ చీర తనకు ఒక మోస్ట్ స్పెషల్ పర్సన్ గిఫ్టుగా ఇచ్చారని అందుకే ఆ చీర అంటే తనకు ఎంతో ఇష్టమని రష్మిక వెల్లడించారు.మరి ఈమెకు ఈ చీరను స్పెషల్ గా గిఫ్ట్ చేసినటువంటి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే…

రష్మికకు ఈ చీరను ప్రత్యేకంగా గిఫ్ట్ గా ఇచ్చిన వారు మరెవరో కాదు ఆమె తల్లి. రష్మిక కోసం రష్మిక వాళ్ళ మమ్మీ ( Rashmika Mother )తనకు ప్రత్యేకంగా ఈ చీరను తన పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇచ్చారట.పుట్టినరోజు సందర్భంగా తన తల్లి కానుకగా ఇవ్వడంతో ఈ శారి అంటే తనకు ఎంతో ప్రత్యేకమని అందుకే ఈ పెళ్లి వేడుకలో ఈ చీర కట్టుకున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మిక ఆ చీర గురించి చెబుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా ( Pushpa 2 )షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.