సంక్రాంతి రేస్.. కల్కి పోయి సలార్ వచ్చిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.ఈ సిరీస్ తర్వాత ఈయన మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.

 Salaar Movie Release Update, Salaar, Salaar Rights, Social Media , Prabhas, Kama-TeluguStop.com

ప్రజెంట్ ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టగా ఆ సినిమాలన్నీ వేగంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.

వాటిలో ముందు సెప్టెంబర్ 28న ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ( Salaar ) రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు.దీంతో ఈ ఏడాది ఇది ప్రభాస్ రెండవ సినిమ అని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.కానీ సలార్ వాయిదా పడడంతో ఈ ఆనందం మొత్తం పోయింది.అలాగే ఈ సినిమా తర్వాత మరో మూవీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.”కల్కి 2898 ఏడి( Kalki 2898 AD )” వచ్చే ఏడాది మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

కల్కి ముందుగా సంక్రాంతి రేస్ లో ఉంది.కానీ షూటింగ్ ఇంకా అవ్వలేదు.పైగా విఎఫ్ఎక్స్ వర్క్ కు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ సినిమాను సంక్రాంతి నుండి వాయిదా వేశారు.మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

అయితే ఇప్పుడు సంక్రాంతి రేస్ లో ప్రభాస్ సినిమాలు లేదు అని అనుకుంటూ ఉండగానే సలార్ సినిమా ఉండబోతుంది అనే టాక్ వైరల్ అయ్యింది.సలార్ సినిమా వాయిదా పడడంతో సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్టు రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

మరి ఇవి ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube