టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఎన్టీఆర్ 2000 లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత 22 ఏళ్ల లోపు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు.ఇకపోతే ఇటీవల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఆ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ ను కొట్టాడు.
మామూలు పాత్రలతోనే కాకుండా, యమదొంగ లవకుశ లాంటి సినిమాల్లో కూడా నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ హీరో అవ్వడాన్ని కంటే ముందుగా చిన్నప్పుడే బాలరామాయణం సినిమాలో నటించి కొట్టేశాడు.
ఇక బాల రామాయణం సినిమాలో ఎన్టీఆర్ నటన చూసిన కొందరు ప్రముఖులు తాతకు తగ్గ వారసుడు అంటూ ఎన్టీఆర్ ఫై ప్రశంసల వర్షం కురిపించారు.బాల రామాయణం సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్రలో అద్భుతంగా నటించాడు.
ఇక అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి దాదాపుగా 100 రోజులు ఆడింది.ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటికి దాదాపుగా 25 ఏళ్లు పూర్తి అయ్యింది.

ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక దర్శకుడు గుణశేఖర్ చిన్నపిల్లలతో ఈ ఇతిహాసాన్ని చాలా అద్భుతంగా తొలగించారు అని చెప్పవచ్చు.ఇందులో ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించగా, స్మితా మాధవ్ సీతగా నటించారు.అలాగే స్వాతి బాలినేని రావణుడిగా నటించగా, నారాయణం నిఖిల్ లక్ష్మణుడి పాత్రలో కనిపించారు.అయితే మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట.కానీ ఆ తరువాత ఒక్కొక్కరు సినిమా బాగుంది బాగా నటించాడు అన్నా వార్త రావడంతో నెమ్మదిగా జనాలు థియేటర్లకు రావడం మొదలు పెట్టారట.