అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం లో గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీకే అరుణ.ఈ కార్యక్రమంలో డీకే అరుణ తో పాటు మేడ్చల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామ్ చందర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ జనరిక్ మెడికల్ కేంద్రాల ద్వారా ప్రజానీకానికి సరసమైన ధరలకు నాణ్యత మందులు అందించే దిశగా, ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రం (PMBJPK) జనరిక్ అందించడానికి ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
అంతేకాకుండాతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 159 జనరిక్ మెడికల్ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
గోపు రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఇది పదమూడవ కేంద్రంగా ప్రారంభించడం జరుగుతుందని,ఈ జనరిక్ మెడిసిన్.తక్కువ ధరలకు లభిస్తాయి కానీ నాణ్యత మరియు సమర్థతలో ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలకు సమానంగా ఉంటాయి తెలియజేశారు.