ఎప్పటిలాగే ఈ ఏడాది ఎంతో మంది నటీనటులకు, దర్శకులకు మర్చిపోలేని గుర్తులను మిగిల్చింది.పలువురు సినిమా తారలు, దర్శకులు మంచి విజయాలను సొంతం చేసుకోగా.
కొందరికి మాత్రం చేదు గుర్తులను మిగిల్చింది.పలువురు హీరోలతో పాటు, దర్శకులకు ఈ ఏడాది కలిసి రాలేదు.
ఎంత పెద్ద సినిమా తీసినా హిట్ పడలేదు.ఇంతకీ 2021 కలిసి రాని సినీ జనాలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అజయ్ భూపతి, మారుతి, శివనిర్వాణ వంటి దర్శకులకు 2021లో ఒక్క హిట్ కూడా ఖాతాలో పడలేదు.అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన అజయ్ భూపతి 2018లో ఆర్ ఎక్స్ 100 మూవీతో సంచలన విజయాన్ని అందుకున్నాడు.
అదే ఊపులో ఈ ఏడాది శర్వానంద్, సిద్దార్ధ తో కలిసి తీసిన మహా సముద్రం సినిమా బాగా నిరాశ కలిగించింది.
అటు సక్సెస్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు మారుతికి కూడా ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు.

గతేడాది ప్రతి రోజు పండుగే సినిమాతో చక్కటి విజయాన్ని అందుకున్నాడు.ఈ ఏడాది మాత్రం ఒక్క హిట్ కొట్టలేకపోయాడు.అటు టీచర్ గా పని చేసిన శివనిర్వాణ.సినిమాలపై మోజుతో పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.ఆయన 2017లో నిన్ను కోరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.అనంతరం మజిలీ సినిమాలో మరో విజయాన్ని అందుకున్నాడు.
ఈ ఏడాది టక్ జగదీష్ తెరకెక్కించినా.అంతగా సక్సెస్ కాలేదు.

అటు గతంలో వినయ విధేయ రామ విషయంలో బోయపాటి శ్రీనుకు గట్టి దెబ్బ తగిలింది.కానీ ఈ ఏడాది బాలయ్యతో అఖండ సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు.ఇక శ్రీకాంత్ అడ్డాల, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ కూడా గతంలో హిట్స్ లేక ఇబ్బంది పడ్డా ఈ ఏడాది ఫర్వాలేదు అనిపించారు.మొత్తంగా ఈ ఏడాది కొందరి దర్శకులకు ఏమాత్రం కలిసి రాలేదు.