ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రాధాకృష్ణ( Andhra Jyothi RK Radhakrishna ) ఎవరినైనా సరే ఎలాంటి ప్రశ్న అయినా అడగగలరు.చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఎన్నో బోల్డ్ క్వశ్చన్లు కూడా వేశారు.
రూమర్స్, కాంట్రవర్షల్ టాపిక్స్ గురించి కూడా ప్రశ్నలు అడిగి అసలైన నిజాలను స్వయంగా సెలబ్రిటీల నోటి నుంచే రాబట్ట గలిగారు.ఇటీవల ఈ దిగ్గజ ఇంటర్వ్యూయర్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని ఇంటర్వ్యూ చేశారు.
ఆ ఇంటర్వ్యూలో “మీరు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారా? అని పూరి జగన్నాథ్ ని ఒక క్వశ్చన్ సూటిగా అడిగారు.
దానికి పూరి జగన్నాథ్( Puri Jagannath ) సమాధానం ఇస్తూ.” డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యింది లేదు! కానీ గత మూడేళ్లుగా బాగా తాగుతున్నాను.మా గురువుగారు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) పుణ్యమా అని రోజూ మందు తాగడం అలవాటయింది.
గత మూడు సంవత్సరాలుగా అట్లనే చేస్తున్నా.ఆర్జీవీతో సరదాగా కూర్చొని రోజూ తాగుతున్నా.ఇంతకుముందు ఏవైనా పార్టీలో మందు బాటిల్ పట్టుకొని తాగినట్లు యాక్ట్ చేసేవాడ్ని, కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ గా బాగా తాగడం నేర్చుకున్నా.ఇదో వెధవ అలవాటు.” అని చెప్పుకొచ్చాడు.డిప్రెషన్ వల్ల ఇలా తాగుడికి బానిస కాలేదని, సరదాగా మాత్రమే ఈ అలవాటు అయ్యిందని చెప్పుకొచ్చాడు.
డిప్రెషన్( Depressioon ) వస్తే తాను ఎక్స్‌సర్‌సైజులు చేస్తాను కానీ మందు తాగనని పేర్కొన్నాడు.మొత్తం మీద డ్రగ్స్ వాడినట్లు అతనిపై వస్తున్న ఆరోపణలకి పూరి జగన్నాథ్ చెక్ పెట్టాడు.ఇక కెరీర్ పరంగా ఈ మాస్ దర్శకుడు చాలా అపజయాలను ఫేస్ చేస్తున్నాడు.గత దశాబ్ద కాలంలో పదుల సంఖ్యలో సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో ఒకటి రెండు మాత్రమే హిట్ అయ్యాయి.
మిగతావన్నీ అతనికి నిరాశనే మిగిల్చాయి.రీసెంట్‌గా లైగర్ సినిమా( Liger Movie ) కూడా ఎదురు తన్నింది.
దానివల్ల అతడు చాలా చిక్కుల్లో పడాల్సి వచ్చింది.విజయ్ కెరీర్ గ్రాఫ్ కూడా ఈ ఫ్లాప్ తో చాలా పడిపోయింది.
ఇప్పుడు ఈ దర్శకుడు డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు.అది హిట్ అయితేనే ఇండస్ట్రీలో ఇతడు మనుగడ సాగించగలడు.