రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఆరెపల్లి, ఇల్లంతకుంట, తిప్పాపూర్, జవార్ పేట్, జంగంరెడ్డిపల్లి, కందికట్కూర్, తెణుగువానిపల్లె గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజ్ అయిన సందర్భంగా ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మీర్జా, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ, సూపర్డెంట్ వినోద్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ సూర్య, పంచాయితీ కార్యదర్శి లు సంతోష్, వరుణ్, వీణ రాణి, ప్రియాంక, నరేందర్ రెడ్డి,కడగండ్ల తిరుపతి, అశోక్, మధు, తదితరులు పాల్గొన్నారు.