రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ శాసన మండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి 69 వ జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన
తెలంగాణాలో పార్టీ అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు పాటుపడాలని రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తుందని ఈ నేల 23 నుండి బస్సు యాత్ర చేపట్టనున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు రంగు శేషాచలం గౌడ్,బీసీ సెల్ అధ్యక్షులు బింగి వేంకటేశం, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,శ్యాగ ప్రశాంత్, శ్రీనివాస్,అభిషేక్,సోనూ తదితరులు పాల్గొన్నారు.