చదువు, ఉద్యోగంతో పాటు మానసికోల్లాసం కోసం క్రీడలు కూడా ముఖ్యమే

రాజన్న సిరిసిల్ల జిల్లా: మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని,యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని గ్రామాల యువతకు స్పోర్ట్స్ కిట్స్ లను ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి అందజేశారు.

 Along With Studies And Work Sports Are Also Important For Mental Enjoyment Sp Ak-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు.

యువత చెడు మార్గాల వైపు మరలకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

జిల్లాలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహించడాం జరుగుతుందని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది అన్నారు.యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు.

గ్రామంలో అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారమైనా పోలీసులకు అందించాలని కోరారు.పోలీస్ లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల భద్రతే మా భాద్యత అని ఎస్పీ అన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ నవత ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube