ఈ ఎల్బీడబ్ల్యూ నిబంధనల గురించి మీకు తెలుసా...

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఔట్స్ లలో ఎల్బీడబ్ల్యూ ఔట్ టాప్ ప్లేస్ లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.ఇది కాంట్రవర్షియల్ కాబట్టే డెసిషన్ రివ్యూ మోడ్ కూడా అందుబాటు లోకి తీసుకు రావాల్సి వచ్చింది.

 Did You Know About These Lbw Rules, Sports Updates, Latest News, Viral Latest Ne-TeluguStop.com

ఒక్కోసారి ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్లు కూడా తప్పుగా నిర్ణయాలు ప్రకటిస్తుంటారు.అయితే అసలు ఎల్బీడబ్ల్యూ ఔట్ అంటే ఏంటి? క్రికెట్ లో దీనికున్న నిబంధనలు ఏంటి? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసు కుందాం.

ఎల్బీడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్ అని అర్థం.బౌలర్ వేసిన బంతి బ్యాట్‌‌కు తగలకుండా కాలికి తగిలితే… అది వికెట్‌‌కు తగులు తుందా లేదా అనేది నిర్ణయించి ఔట్ ఇవ్వడం జరుగు తుంది.

వికెట్లకు స్ట్రైట్ గా వెళ్లిన బంతికి కాలు అడ్డం పెడితే అది ఔట్ అన్నమాట.అయితే కొన్ని బంతులు స్పిన్ అవుతూ ఉంటాయి.కొన్ని బౌన్స్ అయ్యి వికెట్లను ఢీ కొట్టడం జరగదు.ఇలాంటి సమయంలో అంపైర్ నిర్ణయాలు తప్పు అయ్యే అవకాశం చాలా ఎక్కువ.

అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ కు రివ్యూ ఇచ్చే అవకాశం కల్పించారు క్రికెట్ అధికారులు.

ఇక ఇప్పుడు ఎల్బీ డబ్ల్యూ నిబంధనలు చూస్తే… బంతి ఎక్కువ ఎత్తులో వెళ్తే అది నాటౌట్.

బంతి నోబాల్ అవుతే అది కూడా నాటౌట్.అయితే బంతి వెనక కాలికి తగిలితే ఔట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ.

స్వీప్ షాట్ ఆడుతున్నప్పుడు బంతి ఛాతికి తగినా ఔట్ ఇస్తారు.ఎందు కంటే ఛాతి స్టంప్స్ కి అడ్డు ఉంటుంది కాబట్టి! అయితే బ్యాట్ కు తాకుతూ వెళితే అది ఔట్ ఇవ్వరు.

అలానే బ్యాటర్ కాలు వికెట్లకు దూరంగా ఉన్నప్పుడు బంతి వచ్చి అతని కాలికి తగిలితే అవుట్ ఇవ్వరు.పాకిస్థాన్ అంపైర్లు పాకిస్థాన్ బ్యాటర్ల విషయంలో ఎల్బీడబ్ల్యూ అసలు ఇవ్వరు.

ఇలాంటి పరిస్థితి కూడా ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube