శ్రీకాకుళం జిల్లా: సారవకోట మండలంలోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలును ప్రారంభించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. పాల్గొన్న జెసి విజయ సునీత, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ జయంతి, ఇతర అధికారులు.డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.28 నెలల వైసిపి ప్రభుత్వ పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలతో సంచలనమైన పరిపాలన కొనసాగిస్తున్నాం.అందుకే బై ఎలక్షన్స్ మొదలు కార్పొరేషన్, పరిషత్ ఇలా అన్ని ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసిపి గెలుచుకుంది.చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం మనమే గెలుచుకున్నాం.
అప్పటి నుంచి టిడిపి వాళ్ళకు పిచ్చి ఎక్కువైపోయింది.
అందుకే అనవసర ప్రేలాపణలు వెళుతున్నారు.
మన పాలన చూసి తెలుగుదేశం వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు.ప్రతీ అంశంపై తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తాపత్రయ పడుతున్నారు.1983 నుంచి 2014 వరకు వివిధ ప్రభుత్వాల ద్వారా వచ్చిన ఇళ్ళకు హక్కు కల్పించాలనే సంపూర్ణ గృహ హక్కు పథకం తెచ్చాము.దానిని కూడా తెలుగుదేశం వక్రీకరిస్తోంది.
మీరు ఎవరూ డబ్బులు కట్టద్దు అని చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.వీళ్ళు ఎటువైపు పోతున్నారనే అనుమానం కలుగుతోంది.
పేదవారికి ఏది చేసినా తప్పు అని స్థితిలో టిడిపి ఉంది.టిడిపి వారికి మతిస్థిమితం తప్పింది.
అందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు.