క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నిచ్చిన మెట్రో ట్రైన్ టైమింగ్స్‌.. క్రికెట్ కి మెట్రోకీ సంబంధం ఏమిటి?

మన ఇండియాలో క్రికెట్ కి వున్న క్రేజ్ అంతాఇంతా కాదు.ఇక్కడ టైటిల్ చూడగానే మీకు క్రికెట్ కి మెట్రోకీ సంబంధం ఏమిటి అనే అనుమానం వస్తుంది కదూ.

 Delhi Metro Extended Timings Amid India Vs Sa T20 Match In Arun Jaitley Stadium-TeluguStop.com

సంబంధం వుంది.భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్ల మధ్య జూన్ 9వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభ‌మ‌వ‌నున్న విష‌యం అందరికీ తెలిసిందే.

మ్యాచ్ రోజు ప్రయాణికుల రద్దీని ముందుగానే ఊహించిన ఢిల్లీ మెట్రో అధికారులు.మెట్రో ట్రైన్ టైమింగ్స్‌‌ను పొడిగించాలని నిర్ణయించింది.ప్రేక్షకులు తమ గమ్యస్థానాలకు సజావుగా చేర్చడానికి వీలుగా సమయాన్ని 30-45 నిమిషాల వరకు పొడిగించాలని నిర్ణయించింది.

ఈ నేఫ‌థ్యంలోనే ఢిల్లీ మెట్రో 48 అదనపు స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నుంది.

భారత్, దక్షిణాఫ్రికా జ‌ట్ల మధ్య గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో T-20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది.ఈ స్టేడియం ఢిల్లీ గేట్, ITO మెట్రో స్టేషన్‌లకు ఆనుకొని కష్మీరే గేట్, రాజా నహర్ సింగ్ స్టేషన్‌ల మధ్యలో ఉంది.

ఢిల్లీ మెట్రో అన్ని లైన్‌లలో చివరి ట్రైన్‌ సమయాలను 30-45 నిమిషాలు పొడిగించడం ద్వారా అదనపు స‌ర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి.సాధార‌ణంగా మెట్రో స్టేషన్‌ల నుండి చివరి రైళ్లు రాత్రి 11:30 వ‌ర‌కు న‌డుస్తాయి.మ్యాచ్ నేఫ‌థ్యంలో అర్ధరాత్రి వ‌ర‌కు ట్రైన్‌లు అందుబాటులో ఉండ‌నున్నాయి.

Telugu Arunjaitley, Cricket, Delhi Metro, Delhimetro, India Sa, Teams, Latest-La

ఇకపోతే, ఢిల్లీ మెట్రో స్టేషన్ పలు వివాదాలకు కూడా దారి తీస్తోంది.ఆమధ్య ఓ జంట అశ్లీల కార్యకలాపాలకు పాల్పడటం, ఆ యవ్వారం కాస్త సీసీ కెమెరాలో రికార్డవ్వడం, ఆ వెంటనే పోర్న్ సైట్‌లో ప్రత్యక్షం కావడం కలకం రేపింది.ఈ ఘటనపై దేశంలో పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసినదే.

రైల్వే కంట్రోల్ రూంలో భద్రత మధ్య ఉండాల్సిన సీసీ ఫుటేజీలు పోర్న్ సైట్‌లోకి ఎలా వచ్చాయంటూ ఈ విషయంపైన పెద్దఎత్తున దుమారం చెలరేగింది.మెట్రో రైల్వేకు సంబంధించిన వ్యక్తే ఈ వీడియోని దొంగతనం చేసి పోర్న్‌సైట్‌లో పెట్టి వుంటాడని అధికారులు చెప్పి, మెట్రో రైల్వే వారిని అనుమానించిన సంగతి తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube