చూడటానికి సింపుల్ గా ఉన్నా దీపికా డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ( Deepika Padukone ) ఇటీవల కల్కి( Kalki ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సందడి చేసిన సంగతి తెలిసిందే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Deepika Padukone Dress Cost Details Goes Viral, Deepika Padukone, Tollywood ,-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ముంబైలో నిర్వహించిన ఈ సినిమా వేడుకకు దీపిక హాజరవ్వడమే కాకుండా ఈ కార్యక్రమంలో ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Telugu Bollywood, Kalki, Nag Aswin, Prabhas, Pregnant, Tollywood-Movie

దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రెగ్నెంట్( pregnant ) అనే సంగతి మనకు తెలిసిందే.ఈమె ప్రెగ్నెన్సీ ప్రకటించినప్పటి నుంచి బయట పెద్దగా ఎక్కడ కనిపించలేదు కానీ ఈ కార్యక్రమానికి ఈమె హాజరు కావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ కార్యక్రమానికి బ్లాక్ కలర్ టైట్ అవుట్ ఫిట్ ధరించిన ఈమె ఈ డ్రెస్ లో తన బేబీ బంప్ ( Baby Bump ) కూడా క్లియర్ గా కనిపించడంతో ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే దీపిక వేసుకున్న డ్రెస్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.

Telugu Bollywood, Kalki, Nag Aswin, Prabhas, Pregnant, Tollywood-Movie

ఈ డ్రెస్ చూడటానికి చాలా సింపుల్ లుక్ లో ఉన్నప్పటికీ దీని ధర మాత్రం చాలా ఎక్కువే అని చెప్పాలి.చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ డ్రెస్ ధర రూ.1.14 లక్షలు అని సమాచారం.అంతేకాకుండా ఆమె Magda Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది.వాటి విలువ రూ.41.500.ఇక దీపిక ధరించినదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.ఇక ఈమె కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే.ఇక దీపిక పదుకొనే ఇప్పటివరకు నటించిన బాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కానీ మొదటిసారి ఈమె తెలుగు సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube