నార్త్ కరోలినా లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్య పరించింది.సంతోష పెట్టింది.
ఎంతో మందికి ఆదర్శం అయ్యింది…ఇంతకీ ఏమిటా సంఘటన అంటే… బిల్లీ హౌజెస్ అనే వ్యక్తి గత కొంత కాలంగా కిడ్నీ సంభందిత వ్యాధితో భాదపడుతున్నాడు.ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయని, అవి గనుకా మార్చకపోతే బ్రతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు.
దాంతో ఏమి చేయాలో అర్థం కాక ఆందోళన చెందుతున్న ఆ కుటుంభానికి నేను ఉన్నాను అంటూ ఓ అమ్మాయి ముందుకు వచ్చింది.
బిల్లీని చూడటానికి డిలారెన్ మెక్నైట్ అనే అమ్మాయి వచ్చి జరిగిన పరిస్థితి అంతా తెలుసుకుంది.
వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని ఆమె కిడ్నీలు అతడికి సరిపోతాయా లేదా చూసింది.వైద్యులు సరిపోతాయని చెప్పడంతో ఆమె సంతోషపడి తన కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించింది…ఇంతకీ ఆమె ఎవరో కాదు.
బిల్లీ దత్తత తీసుకున్న కుమార్తె.చిన్నతనంలో ఆమె అనాధగా ఉండాల్సిన సమయంలో ఆమెని దత్తత తీసుకుని అక్కడి చర్చికి సంభందించిన ఆశ్రమంలో చేర్పించాడు.
కంటికి రెప్పలా చూసుకున్న అతడు ఈ పరిస్థితిలో ఉండటం చూసి చెలించిపోయిన ఆమె దత్తత తండ్రి కోసం ఈ సాహసం చేసింది ఈ విషయాన్ని బిల్లీ స్వయంగా తన ఫేస్బుక్ లో పంచుకున్నాడు.