ఇప్పుడు హడావుడి పడితే ఏం లాభం చిన్నమ్మ ..?

ఏపీలో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసేసుకున్నారు ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ).ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.

 Daggubati Purandeswari Political Strategy In Ap Elections , Daggupati Purandares-TeluguStop.com

అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపైనే నిమగ్నం అయ్యాయి.వైసిపి ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ.

ఎన్నికల రేసులో ముందంజలో ఉండగా, టిడిపి, జనసేన( TDP, Jana Sena ) సైతం ఇదే కసరత్తు మొదలుపెట్టాయి.అయితే బిజెపి మాత్రం ఇంకా పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలా ? ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది.దీనికి కారణం ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉండటమే.అయితే ఉన్నట్టుండి ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి.15 రోజుల్లో క్షేత్రస్థాయిలో బిజెపిని బలోపేతం చేయాలంటూ ఆమె క్యాడర్ కు పిలుపునిచ్చారు.తన బాధ్యత ఇంతవరకేనని, ప్రజలను కలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత, కర్తవ్యం అన్ని క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులదేనని ఆమె తేల్చి చెప్పారు .పార్టీలో చేరికలు ఉండేలా చూసుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Jagan, Vikasitbharath-Politics

అరకు పార్లమెంట్( Araku ) నియోజకవర్గంలో పర్యటించిన ఆమె స్థానిక నాయకులతో భేటీ అయ్యారు .ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో పాటు, మరో కొంత మంది నాయకులకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో వస్తుందని ,దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, బిజెపికి ఓటు వేద్దామనే సంకల్పం ప్రజల్లో తీసుకురావాలని సూచించారు.బిజెపికి ఓటు వేసిన కుటుంబాలతో స్థానిక నేతలు మమేకం కావాలని సూచించారు.‘ బిజెపి కార్యకర్తలలో ధైర్యం వచ్చింది.వికాసిత్ భారత సంకల్ప యాత్ర( Vikasit Bharath Sankalp Yatra )లో వైసీపీ నేతలను నిలువరించి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం సానుకూలత పెంచిందని, ప్రజా సమస్యల విషయంలో అవసరమైతే ఘర్షణకు దిగాలి, లక్ష్యాలు సాధించాలి, ప్రభుత్వ అధికారులను నిలదీయాలని పురందరేశ్వరి అన్నారు.

Telugu Ap Bjp, Ap Cm Jagan, Ap, Jagan, Vikasitbharath-Politics

అయితే పురందరేశ్వరి ఇప్పటికిప్పుడు హడావుడిగా చేస్తున్న వ్యాఖ్యలు బిజెపి నేతలతో పాటు ,రాజకీయ వర్గాలను ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి.ఎన్నికలకు సమయం ముంచుకు వచ్చే వరకు చేరికల విషయంపై పురందరేశ్వరి పెద్దగా దృష్టి పెట్టలేదు.పరోక్షంగా టిడిపికి మేలు చేసే విధంగానే ఆమె వ్యవహరించారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి.

అయినా ఇప్పుడు హడావుడిగా ఆమె పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలంటూ పిలుపునివ్వడం పై సెటైర్స్ ఎన్నో వస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube