క్రెడిట్ కార్డ్ మోసాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ గ్యాంగ్ ను పట్టుకున్నా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.7 మంది అరెస్ట్.కోటి 11లక్షల 40వేల నగదు,3కార్లు,4 లాప్ టాప్,12మొబైల్ ఫోన్స్,10CPUలు,రబ్బర్ స్టాంప్స్ ,16చెక్ బుక్స్,18డెబిట్ కార్డ్స్ స్వాధీనం.సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర….ఇంటర్నేషనల్ క్రెడిట్సి కార్డ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాం.ఈ నెల హెచ్ డి ఎఫ్ సి లో పని చేస్తున్న అబ్దుల్ నయీమ్ పిర్యాదు చేశారు.85 హెచ్ డి ఎఫ్ సి ఇంటర్ నేషనల్ కార్డ్స్ నుంచి ఈ ముఠా 64లక్షల 40 వేల నగదు డ్రా చేశారు.ప్రధాన నిందితుడు ఢిల్లీ కి చెందిన నవీన్,మోహిత్,మోను,తోపాటు హైదరాబాద్ కు చెందిన నాగరాజు, శ్రవణ్, శ్రీనివాస్,పవన్ ను అరెస్ట్ చేశాము.
ఈ ముఠా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్న వారి డిటైల్స్ తీసుకున్నారు.యూ కే, సింగపూర్, ఆస్ట్రేలియా క్రెడిట్ కార్డ్స్ యూ జర్స్ ను టార్గెట్ చేశారు.
సిస్టమ్స్ కు మాల్వేర్,వైరస్ వచ్చింది అంటూ నమ్మిస్తారు.దాన్ని క్లీన్ చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ తో మెసేజ్ లు పంపించి, ఓటిపి తో డబ్బులు కొట్టేస్తున్నారు.
ఈ ఫ్రాడ్ హైదరాబాద్, ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది.