మహిళా T20 ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా నిలిచిన దీప్తి శర్మ, మునీబా!

మహిళల T20 ప్రపంచకప్ మంచి ఉత్కంఠభరితంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ప్లేయర్లు రికార్డులు సృష్టిస్తున్నారు.

 Cricketers Deepti Sharma And Muneeba Ali Performing Good In Women T20 World Cup-TeluguStop.com

ఒకరేమో బౌలింగ్ లో అదరగొడితే మరొకరు బ్యాటింగ్ తో సత్తా చాటుతున్నారు.వారే టీమిండియా క్రీడాకారిణి దీప్తి శర్మ మరియు పాక్ బ్యాటర్ మునీబా అలీ. అవును, వంద వికెట్ల క్లబ్ లో టీమ్ ఇండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ భారత్ తరఫున T20ల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ గా తాజాగా రికార్డులు నెలకొల్పింది.విండీస్ పైన 3 వికెట్లు తీయడంతో ఈ ఘనతను పొందింది.

Telugu Cricketerdeepti, Deepthi Sharma, Icc Cup, India, Latest, Mubina, Muneeba

దాంతో ఆమె 89 మ్యాచుల్లో 100 వికెట్లు తీసిన తొలి మహిళా భారతీయ బౌలర్ గా రికార్డులు సృష్టించింది.ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే ఆమె 9వ బౌలర్ కావడం గమనార్హం.4 మ్యాచుల్లో 2 విజయాలతో భారత్ ప్రస్తుతం సెమీస్ వైపుగా పరుగులు పెడుతోంది.ఇక మహిళల T20 క్రికెట్లో ఇప్పటి వరకు 38 సెంచరీలు నమోదు కాగా.

అందులో పాక్ నుంచి ఒకే ఒక్క బ్యాటర్ మునీబా అలీ మాత్రమే ఉండడం కొసమెరుపు.అవును, తాజాగా ఐర్లాండ్ మీద గెలవాల్సిన మ్యాచ్ లో మునీబా 66 బంతుల్లో శతకం నమోదు చేసి పాకిస్థాన్ క్రికెటర్ చరిత్రలో రికార్డు సృష్టించింది.

Telugu Cricketerdeepti, Deepthi Sharma, Icc Cup, India, Latest, Mubina, Muneeba

అవును, తొలి అర్ధశతకం కోసం 40 బంతులను తీసుకొన్న మునీబా ఇక ఆ తరువాత మాత్రం విశ్వరూపం చూపింది.కేవలం మరో 26 బంతుల్లోనే సెంచరీ బోర్డర్ దాటేసింది.గతంలో T20ల్లో మునీబా అత్యధిక వ్యక్తిగత స్కోరు 43 పరుగులే.ఇకపోతే పాకిస్థాన్ ప్రస్తుతం 2 మ్యాచుల్లో అడగా అందులో ఒక విజయం, ఒక ఓటమితో కొనసాగుతోంది.

మిగతా రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తేనే సెమీస్ బెర్తుపై వారికి ఆశలు చిగురిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube