ఐర్లాండ్‌లో( Ireland ) హత్యకు గురైన మలయాళీ చార్టర్డ్ అకౌంటెంట్ దీపా దినమణి (38)( Dipa Dinamani ) అంత్యక్రియలు ఆగస్టు 11న తమిళనాడులోని హోసూర్‌లో జరగనున్నాయి.ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చిన కులులోని ఆమె నివాసంలో ఉంచనున్నారు.
దీప సోదరుడు ఉల్లాస్ దీనమణి.( Ullas Dinamani ) ఆమె 5 ఏళ్ల కుమారుడిని కస్టడీలోకి తీసుకునేందుకు ఐర్లాండ్‌కు వెళ్లారు.
తన సోదరి మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు కార్క్‌లోని ఇండియన్ కమ్యూనిటీ చేసిన సహాయానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.కార్క్ ప్రవాసీ మలయాళీ అసోసియేషన్, డబ్ల్యూఎంసీ కార్క్ సంస్థలు దీప కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను iDonate ఫ్లాట్‌ఫాం ద్వారా 25000 యూరోలను సేకరించాయి.

ఈ హత్య కేసులో ప్రమేయం వున్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు దీప భర్త రిజిన్ రాజన్‌ను( Rijin Rajan ) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.అతనిని ఆగస్ట్ 28న కార్క్ జిల్లా కోర్టులో హాజరుపరచనున్నారు.దీపా దీనమణి జూలై 14న విల్టన్ కార్డినల్ కోర్డ్ రెసిడెన్షియల్ ఏరియాలోని తన ఇంట్లో హత్యకు గురయ్యారు.ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా( CA ) 14 ఏళ్ల అనుభవం వున్న దీప ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్క్ ఎయిర్‌పోర్ట్ బిజినెస్ పార్క్‌లో ఉద్యోగంలో చేరారు.
దీనికి ముందు ఇన్ఫోసిస్, అపెక్స్‌ఫండ్ సర్వీసెస్ తదితర కంపెనీలలో పనిచేశారు.

కాగా.గతేడాది డిసెంబర్‌లో భారతీయ నర్స్, ఆమె ఇద్దరు పిల్లలు దారుణహత్యకు గురైన ఘటన ఇంగ్లాండ్‌లో ( England ) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి భర్తే హంతకుడని తేలింది.
ఈ మేరకు నిందితుడు తూర్పు ఇంగ్లాండ్ కోర్టులో నేరాన్ని అంగీకరిచాడు.అతనికి జూలైలో న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.
దీంతో అప్పటి వరకు నిందితుడిని రిమాండ్‌లో వుంచనున్నారు.హంతకుడిని 52 ఏళ్ల సాజు చెలవాలేల్‌గా గుర్తించారు.
ఇతను భార్య అంజు అశోక్ (35), పిల్లలు జీవా సాజు (6), జాన్వీ సాజు (4)లను హత్య చేసినట్లు అంగీకరించాడు.