నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై వివాదం రాజుకుంది.పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ట్వీట్ చేశారు.అత్యున్నత రాజ్యాంగ అధికారం ఉన్న వ్యక్తి రాష్ట్రపతి కావున ఆమె ప్రారంభించడమే ఔచిత్యమని తెలిపారు.
మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని విమర్శించారు.