కమర్షియల్ కాదు గురూ.. ఇక అన్ని సినిమాలు కంటెంట్ ఓరియంటెడే?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది.దర్శక నిర్మాతలు హీరోలు కూడా ట్రెండ్ కు తగ్గట్టుగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు.

 Content Oriented Movies Coming In Tollywood Ante Sundaraniki Yashoda Thankyou De-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను కొనసాగుతుంది అని తెలుస్తుంది.అదే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల ట్రెండ్.

ఒకప్పుడు భారీ బడ్జెట్ తో పక్కా కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరో నటించాడు అంటే ఆ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అనుకునే వారు.కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఎంత కమర్షియల్ గా ఉన్నా కథ బాలేకుంటే మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోతుంది.

ఇప్పటికే ఈ విషయం ఎన్నో సినిమా విషయంలో నిజమైంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం రానున్న సినిమాలన్నీ కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే కావడం గమనార్హం.

కెరీర్ మొదటి నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులు నాచురల్ స్టార్ గా మారిన నానీ ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘అంటే సుందరానికి’ సినిమా జూన్ పదవ తేదీన విడుదల కానుంది.

ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం అంటున్నాడు నాని.ఇక ఇటీవల విడుదలైన టీజర్ ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.

మరోవైపు హీరో హీరోయిన్లు కాదు స్టోరీనే హీరో అంటూ చెబుతూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాడు దగ్గుబాటి వారసుడు రానా.

Telugu Nagachaitanya, Nani, Rana, Samantha, Shaakuntalam, Thankyou, Tollywood, T

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.ఇక మరోవైపు మనం, 24 లాంటి మంచి మంచి సినిమాలతో సర్ప్రైస్ చేసిన విక్రమ్ కె.కుమార్ ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో నాగచైతన్యతో ‘థాంక్ యు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఇప్పటివరకు ఎప్పుడు కనిపించినంత డిఫరెంట్గా ఈ సినిమాలో నాగచైతన్య కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

సమంత నటిస్తున్న శాకుంతలం యశోద ఇలాంటి సినిమాలు కూడా ఈ కోవలోకే వస్తాయి.ఇలా మాస్ మసాలా కు దూరంగా ప్రేక్షకుల హృదయాలను దగ్గర ఇదే కథతో ఇక రానున్న రోజుల్లో సినిమాలు మొత్తం సిద్ధం అవుతున్నాయి అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube