ఈ రోజు (03.12.2021) వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి జిల్లాలోని పలు సమస్యలు, మరియు కుల్కచెర్ల మండలంలోని పుట్టపహాడ్ గ్రామంలోని రైతు చంద్రమ్మ బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి రైతుభీమా కాజేసిన దానిపై న్యాయం జరిగేట్టు, మరియు ధాన్యం కొనుగోలుపై జరిగిన అక్రమాలపై, వరి కొనుగోలు కేంద్రాలను వరి ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రారంభించాలని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన మాజీ పార్లమెంట్ సభ్యులు వి.హనుమంత రావు గారు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, TPCC ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యే,DCC అద్యక్షులు T.రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ MLC రాములు నాయక్ గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మండల అధ్యక్షులు.
పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపారు.
తర్వాత మంత్రి, కలెక్టర్ను కలిసి వినతి పత్రాలను అందచేశారు.