ప్రశ్నిస్తే పీడి కేసులు..నిలదీస్తే ఐటీ,ఈడీ దాడులు:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి పైర్

ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన రాజ్యం, ప్రశ్నించే వారిని నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ యాక్ట్ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు.

 Congress Clp Leader Bhatti Vikramarka Fires On State And Central Governments Det-TeluguStop.com

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 28వ రోజు గురువారం ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామం లో మొదలైంది.ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలను పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురి చేయడం వల్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని అన్నారు.

Telugu Central, Congress Clp, Ed, Khammam-Political

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమ్మన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి నడుం బిగించానని తెలిపారు.ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube