సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా గత దశాబ్ద కాలంగా సక్సెస్ లు లేకుండా పోయాయి.ఇటీవల ఆయన అన్నాత్తే అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ సినిమా దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది.తెలుగు లో పెద్దన్నగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏమాత్రం ఆకట్టుకోలేక పోయినా విషయం తెలిసిందే.
తమిళనాడు లో కూడా ఈ సమయం లో ఆయన సినిమాలు తీవ్ర నిరాశ పర్చుతున్నాయి.అందుకే ఆయన సినిమాల ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దాంతో కాస్త గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు రజనీకాంత్ తన తదుపరి సినిమా ని నెల్సన్ దిలీప్ దర్శకత్వం లో చేసేందుకు కమిట్ అయ్యాడు.
సూపర్ స్టార్ విజయ్ హీరోగా బీస్ట్ అనే సినిమా ను తెరకెక్కించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దిలీప్ నెల్సన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు.
ముఖ్యంగా తమిళ ఆడియన్స్ మరియు విజయ్ అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.ఈ సమయం లోనే రజనీకాంత్ హీరో గా ఆయన సినిమా కమిట్ అవ్వడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో కొందరు కావాలని నెల్సన్ కి రజినీకాంత్ గుడ్‌బై చెప్పేశాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
నెల్సన్ తీసుకు వచ్చిన స్క్రిప్ట్ విషయం లో రజనీకాంత్ అసంతృప్తి తో ఉన్నారని.ఆ కారణంగానే సినిమా క్యాన్సిల్ చేసుకుంటామంటూ సూచించాడట అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే రజినీకాంత్ అలా ఒకసారి కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ చేసుకునే అంత కుసంస్కారి కాదు అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీస్ట్ చిత్రం ఫ్లాప్ అయినంత మాత్రాన ఇచ్చిన అవకాశాన్ని రజనీకాంత్ ఎలా వెనక్కు తీసుకుంటాడు రా బాబు అంటూ కొందరు అభిమానులు స్వయంగా సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ కి సమాధానం ఇస్తున్నారు.