రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ( Telangana Assembly Elections) గుజరాత్ ,ఢిల్లీ ల అహంకారానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం అని అభివర్ణించారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియా తో ఇష్టా గోష్టి గా మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కెసిఆర్ 100 స్థానాలకు పైగా ప్రచారం చేస్తారని, తాను జిహెచ్ఎంసి తో పాటు కామారెడ్డి, సిరిసిల్లలో ప్రచారం చేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్( Congress ) రాబోయే ఎన్నికలలో ధన ప్రవాహం పారించడానికి సిద్ధమైందని ఆ దిశగా కర్ణాటకలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికిన 42 కోట్ల డబ్బు తెలంగాణకు తరలించ దానికి సిద్దం గా ఉన్నదేనంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఇప్పటికే కొడంగల్ కి ఎనిమిది కోట్లు చేరినట్లుగా సమాచారం ఉందన్నారు.రాజకీయాల్లో ధన ప్రవాహం అరికట్టడం కోసం ఈ సారి సిరిసిల్లలో డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదని నిర్ణయించామని ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని కేవలం రీడర్ అని వాళ్ళ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప స్వతంత్రంగా ఆలోచించే తెలివి లేదంటూ ఆయన విమర్శించారు.
బజపా నేతల అబద్దాలకు హద్దే ఉండదని, 110 స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోతుందంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు.వైఎస్ఆర్టిపి 119 స్థానాల్లో పోటీ చేసినా , రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) మోదీ ( Narendra Modi )తెలంగాణ నుంచి పోటీ చేసినా మాకు ఏం అభ్యంతరం ఉంటుందని తెలంగాణ మిత్రులు ఎవరో ద్రోహులు ఎవరో తెలంగాణ ప్రజలకు అవగాహన ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.తమ మేనిఫెస్టోలో రైతులు, దళితులు మహిళలు, మైనారిటీలకు పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు .బజాపా తో లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఇన్ని మైనారిటీ సంస్థలని ఎందుకు ఏర్పాటు చేస్తామంటూ ఆయన ప్రశ్నించారు.గెలుపు అవకాశాలపై స్పందిస్తూ మాకు గతంలో వచ్చినట్లే 88 స్థానాలు వస్తాయని ఆశిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు .ఈటల రాజేందర్ గజ్వేల్ లోనే కాకుండా మరో 50 స్థానాలలో పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదంటూ కేటీఆర్ తేల్చేశారు.
ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు బదిలీ ని చేపట్టిన ఈసీ చర్యను సాధారణ బదిలీగానే చూస్తున్నామని, ఈసీ సర్వ స్వతంత్రంగా పనిచేస్తుంది అని ఆశిస్తున్నామంటూ ఆయన చెప్పుకోచ్చారు .