వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు... భరించడం కష్టంగా ఉంది: కలర్స్ స్వాతి

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కలర్స్ స్వాతి( Swathi ) ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.అయితే ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Colour Swathi Emotional About Rumours On Her, Colour Swathi, Naveen Chandra-TeluguStop.com

ఇలా భర్తతో కలిసి విదేశాలలో స్థిరపడినటువంటి ఈమె ప్రస్తుతం తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఉన్నటువంటి కలర్స్ స్వాతి తాజాగా మంత్ ఆఫ్ మధు ( Month Of Madhu ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

నవీన్ చంద్రతో కలిసిన నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.

Telugu Swathi, Madhu, Naveen Chandra, Tollywood-Movie

ఈ సినిమాకు మిక్సడ్ టాక్ రావడంతో చిత్రబృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది కావాలనే సినిమా ఎలా ఉంది అనే విషయం కూడా తెలియకుండా సినిమాలకు బ్యాడ్ రివ్యూ ఇస్తున్నారని ఇలా ఇవ్వటం వల్ల ఒక సినిమాకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని దయచేసి ఇలాంటి వార్తలు రాయకండి అంటూ డైరెక్టర్ వెల్లడించారు.అయితే ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి నటి కలర్స్ స్వాతి( Colors Swathi ) కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Telugu Swathi, Madhu, Naveen Chandra, Tollywood-Movie

సినిమా ఇండస్ట్రీలో నటిగా నేను కొనసాగుతున్నప్పుడు వృత్తిపరమైనటువంటి విమర్శలున్న ఎన్నో వస్తూ ఉంటాయి.అయితే ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపారు.అయితే కొంతమంది మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారని నా గురించి ఎంతోమంది తప్పుడు వార్తలను రాశారు అంటూ ఈమె తెలియజేశారు.నా గురించి తెలియని వారు ఆ వార్తలను కనుక చదివితే అది నిజమేనని నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొంతమంది వాటిని నమ్మారు కూడా.

ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలను రాయడం మంచిది కాదని ఆ వార్తలు చూసి తాను ఎంతగానో బాధపడ్డానని ఈమె తెలియజేశారు.వృత్తిపరమైనటువంటి విమర్శలను ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం భరించడం కష్టం అంటూ కలర్స్ స్వాతి( Colors Swathi ) ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube