బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలపై గాంధీభవన్( Gandhi Bhavan ) లో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు హాజరయ్యారు.

 Cm Revanth Reddy Serious Comments On Bjp Brs Parties , Cm Revanth Reddy, Congres-TeluguStop.com

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి అని వ్యాఖ్యానించారు.లోక్ సభ ఎన్నికలకు మంచి ఫలితాలు వచ్చేలా అందరూ కృషి చేయాలని సూచించారు.

పార్టీ అధిష్టానం తెలంగాణకు పరిశీలకులను నియమించడం జరిగింది.హరీష్ చౌదరి ( Harish Chaudhary )చైర్మన్ గా కమిటీ పనులు చూసుకుంటున్నారు.

ఈ లోక్ సభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక కమిటీ చూసుకుంటుంది.అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ( bjp ). బీఆర్ఎస్ ( BRS )పార్టీలపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.మోదీ దేశం పై వందల లక్షల కోట్లు అప్పుమోప్పారు.మోదీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయారు.ఇదే సమయంలో జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికల టైములో మరోసారి మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు అని ఆరోపించారు.ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అదేవిదంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది.దేశానికి రాహుల్ లాంటి నాయకుడు ప్రధానిగా రావాలి.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది.ఆ పార్టీ నేతల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.

ఉనికి చాటుకునేందుకు వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు.గతంలో మోదీని కేసీఆర్ ప్రశ్నించిన దాఖలాలే లేవు…అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube