తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో స్పీడ్ పెంచిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) వరుసగా నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ , తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.దీనిలో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించారు.
అయితే కేసిఆర్ ఊహించిన స్థాయిలో జన సమీకరణ జరగకపోవడం , తన ప్రసంగం జరుగుతున్న సమయంలోను పెద్దగా జనాలు కనిపించకపోవడంతో కెసిఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట .దీంతో తన ప్రసంగాన్ని అనుకున్న దానికంటే ముందుగానే ముగించి అక్కడ నుంచి వెళ్ళిపోయారట. కేసీఆర్ ప్రసంగం కూడా సాదాసీదాగా జరగడంతో అనుకున్న మేర సక్సెస్ కాలేదట.కెసిఆర్ సభకు లక్షకు పైగా జన సమీకరణ చేపట్టి తన సత్తా చాటుకోవాలని మంత్రి మల్లారెడ్డి భావించినా, జనాలు అంతగా హాజరు కాకపోవడం నిరాశ కలిగించిందట.
అయితే జనాలు హాజరు కాకపోవడానికి కారణం ఉందట.గుండ్ల పోచంపల్లిలో భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు అనుకున్న సమయానికి ముందుగానే మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు సుధీర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరడంతో, అప్పటి వరకు కేసీఆర్ సభకు హాజరు అవుదాం అనుకున్న కార్యకర్తలు , అభిమానులు సుధీర్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి సమక్షంలోగుండ్ల పోచంపల్లిలో భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ లో చేరే కార్యక్రమానికి వెళ్లడంతో కెసిఆర్ సభ పై ఆ ఎఫెక్ట్ పడిందట.జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన సభ సక్సెస్ కావడం, మేడ్చల్ నియోజకవర్గం లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ( Praja Ashirvada Sabha ) ఫెయిల్ కావడంపై కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కెసిఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ఉన్న కొద్దిపాటి జనాల్లోనూ చాలామంది బయటకు వెళ్లిపోవడం, ఈ వ్యవహారం అంతా మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో కెసిఆర్ మరింత అసహనానికి గురయ్యారట.మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం అనుకున్నంత స్థాయిలో జరగకపోవడం, కెసిఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మొదటి రోజే ఈ విధమైన పరిస్థితి ఏర్పడడంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం నిరాశ కు గురయ్యాడట.