రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( ys jagan ) గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు.ఉద్ధానం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను ప్రారంభించబోతున్నారు.

 Cm Jagan Visit To Srikakulam District Tomorrow , Cm Jagan, Srikakulam District-TeluguStop.com

ఇదే సమయంలో పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది.అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆసుపత్రితో పాటు రిసెర్చ్ సెంటర్ అదేవిధంగా డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ క్రమంలో వీటిని నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది.

కిడ్నీ బాధితుల కోసం ₹742 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారను… ప్రారంభించనున్నారు.

దీని ద్వారా ఉద్ధానంలో ఇంటింటికి కుళాయిలు ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా కానుంది.వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేసిన టైంలో ఉద్దానం ప్రాంతంలో పర్యటించారు.

ఆ సమయంలో అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల ఫించన్ తో పాటు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని మాట ఇచ్చారు.ఆ రకంగానే అధికారంలోకి వచ్చాక.

సీఎం జగన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి.రీసెర్చ్ సెంటర్ కి పునాది వేయడం జరిగింది.

ఇప్పుడు ఆ ఆసుపత్రిని రీసెర్చ్ సెంటర్ ని.గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube