రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ys Jagan ) గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు.

ఉద్ధానం కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను ప్రారంభించబోతున్నారు.ఇదే సమయంలో పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది.

అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆసుపత్రితో పాటు రిసెర్చ్ సెంటర్ అదేవిధంగా డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ క్రమంలో వీటిని నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది.

""img Src=" " / కిడ్నీ బాధితుల కోసం ₹742 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారను.

ప్రారంభించనున్నారు.దీని ద్వారా ఉద్ధానంలో ఇంటింటికి కుళాయిలు ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా కానుంది.

వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేసిన టైంలో ఉద్దానం ప్రాంతంలో పర్యటించారు.

ఆ సమయంలో అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులకు పదివేల రూపాయల ఫించన్ తో పాటు అత్యాధునిక ఆసుపత్రి నిర్మిస్తామని మాట ఇచ్చారు.

ఆ రకంగానే అధికారంలోకి వచ్చాక.సీఎం జగన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి.

రీసెర్చ్ సెంటర్ కి పునాది వేయడం జరిగింది.ఇప్పుడు ఆ ఆసుపత్రిని రీసెర్చ్ సెంటర్ ని.

గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు.

లైంగిక వేధింపుల కేసు .. కెనడాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్ , ఒంటరి మహిళలే టార్గెట్