ప్రొసిజర్ ప్రకారమే సీఎం ఎంపిక..: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో సీఎం ఎవరన్న వ్యవహారంపై మరికాసేపటిలో తెర పడనుంది.ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

 Cm Is Selected According To The Procedure..: Uttam Kumar Reddy-TeluguStop.com

ఇప్పటికే ఢిల్లీ నుంచి డీకే శివకుమార్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు.ఈ క్రమంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్న ఆయన హోటల్ ఎల్లాకు చేరుకోనున్నారు.

అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులతో డీకే శివకుమార్ సమావేశమై అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక వ్యవహారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రొసిజర్ ప్రకారమే సీఎం ఎంపిక ఉంటుందని తెలిపారు.

ఎక్కడా గందరగోళం లేదని స్పష్టం చేశారు.పార్టీ అంతర్గత విషయాలను బయట చెప్పడం సరికాదని తెలిపారు.

మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నానన్న ఉత్తమ్ మొత్తం పార్టీ అధిష్టానానికి తెలిపానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube