ఏపీలో బీజేపీని కూడా మూసేస్తారా? –తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కామెంట్ ఇదే! ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని.ప్రభుత్వం వ్యాపారాలు చేసేందుకు లేదని వెల్లడించిన దరిమిలా.ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంటును కూడా ప్రైవేటీక రిస్తామనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే.
ఏపీలో బీజేపీని ముందు మూసేయండి.ఆ తర్వాత.
మీ ఇష్టం.అనే కామెంట్లు వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలనే కాంక్షతో ఏపీ బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు.అయి తే.కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ప్రకటిస్తున్న విషయాలు వంటివి ఏపీ ప్రజలకు పుండుపై కారం చల్లినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వలేదు.
లోటు బడ్జెట్‌ను బర్తీ చేయడం లేదు.అమ రావతి విషయంపై మాకు సంబంధం లేదని .రాజధాని విషయం రాష్ట్రానికి చెందిందని కుండబద్దలు కొట్టింది.

అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలోనూ సహకరించడం లేదనే వాదన బలంగా ఉంది.ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ ఉక్కును కూడా అమ్మేస్తామని ప్రయత్నించడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.అయితే.
రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం తాము అమ్మకుండా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.ఈ క్రమంలోనే సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ అవ్వాలని నిర్ణయించారు.
అయితే.కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా సాధించలేక పోయారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని చేసిన ప్రకటన ప్రజలకు ఆగ్రహం తెప్పించింది.ఈ నేపథ్యంలోనే తమకు ఏమీ ఇవ్వరు.
ఉన్నవీ లాగేస్తారు.ఇక, బీజేపీతో పనేంటి? అనే చర్చ తెరమీదికి వచ్చింది.అందుకే.మీరేమైనా చేసుకోండి.ముందు మాత్రం ఏపీ బీజేపీని మూసేయండి.అని కామెంట్లు చేస్తుండడం గమనార్హం.