వచ్చే లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర పోటీని నెలకొంది .ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయాన్ని తేల్చుకునేందుకు సిద్ధం అవుతోంది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపి , బీఆర్ఎస్ లకు చెందిన చాలామంది నేతలు ఆసక్తి చూపిస్తుండడం , అలా చేరాలనుకున్న నేతలు చాలామంది కాంగ్రెస్( Congress ) నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఈ విషయంలో పార్టీ హై కమాండ్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ? ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయం ఏమిటి తదితర అంశాలపై క్లారిటీ తెచ్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ రాజకీయాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యవహారాలు అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.బీఆర్ఎస్ , బిజెపి ల నుంచి వలస వస్తున్న నేతలతో పాటు , సొంత పార్టీలోనూ ఎంపీ టికెట్ల కై పోటీ నెలకొనడంతో , అభ్యర్థుల ఎంపిక క్లిస్టతరంగా మారింది.ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో హై కమాండ్ పెద్దల అభిప్రాయాలను తెలుసుకుని ఎవర్ని ఎంపిక చేయాలని విషయంలో పార్టీ హైకమాండ్ వద్దే చర్చించి దీనిపై ఒక నిర్ణయానికి రావాలని రేవంత్ భావిస్తున్నారు.
విజయవాడ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామందికి కాంగ్రెస్ టికెట్ దక్కలేదు .
ఆ సమయంలో కొంతమందికి ఎంపీ టికెట్ ఇస్తామనే హామీని ఇచ్చారు.దీంతో వారి పేర్లను పరిగణలోకి తీసుకోవాలని రేవంత్ హై కమాండ్ పెద్దలకు సూచించబోతున్నారట.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి( BRS ) చెందడంతో, ఈ ఎన్నికల్లో అయినా సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
కనీసం 10 స్థానాలనైన గెలుచుకుని తమ సత్తా చాటుకోవాలనే పట్టుదల తో ఉండడం తో బీఆర్ఎస్ వ్యూహాలకు బ్రేకులు విధంగా రేవంత్ ఢిల్లీ టూర్ లో నే క్లారిటీ తెచ్చుకోనున్నారు.