ప్రపంచం తనని ఐసోలేటెడ్ చేస్తుందని తెలిసినా, త్వరలో తను పొరుగుదేశాలతో పెట్టుకున్న గొడవల వల్ల తీవ్ర ఫుడ్ క్రైసిస్ ని ఎదుర్కోబోతున్నానని తెలిసిన చైనా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు.భారత బోర్డర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పిన చైనా.
ప్రస్తుతం భారత్ ను మరింతగా ఇబ్బందులకు గురిచేయడానికి ఎప్పుడూ భారత్ పై ఏడ్చి ఫెయిల్డ్ నేషన్ పాకిస్తాన్ తో కలిసి తెర వెనుక కుట్రలు చేస్తుంది.తాజాగా కరాచీలో చైనా వార్ షిప్ లు పాకిస్తాన్ అధునాతన సబ్ మెరైన్ గా చెప్పుకునే అగస్టు బి క్లాస్ సబ్ మెరైన్ తో దర్శనమిచ్చింది.
దీన్ని హస్మత్ క్లాస్ గా పాకిస్తాన్ పిలుస్తుంటుంది.
ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది.
భారత్ పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైతే తప్ప తమకు లాభం ఉండదని చైనా జనరల్స్ నివేదికలు ఇస్తున్న నేపధ్యంలో భారత పై పూర్తిస్థాయి యుద్ధానికి చైనా రెడీ అవుతున్నట్టు ఉంది.దానికి తగ్గట్టు పిఓకే,నేపాల్ లోని వైమానిక స్థావరాలలో చైనా మోహరింపులు చేస్తుండగా కరాచీలో కూడా దానిలో భాగంగానే మోహరింపులు చేసుండచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం భారత్,చైనా మధ్య ఏ సమయంలో అయినా యుద్ధం జరిగేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.ఒకవేళ భారత్ పై యుద్ధానికి చైనా పూనుకుంటే ఇదే అదునుగా భావించి సౌత్ చైనా సీ నుండి దాడి చేయడానికి తైవాన్, ఫిలిపైన్స్, జపాన్,అమెరికా,బ్రిటన్ సిద్ధమవుతున్నాయి.