అపార్ట్మెంట్లంటే సాధారణంగా చతురస్త్రాకారంలో ఉన్నవి మనం చూస్తూనే ఉంటాం.కానీ, సర్కిల్ మాదిరి గుండ్రంగా ఉండే అపార్టుమెంట్లని మీరెప్పుడైనా చూశారా? ఇది మన దేశంలో కాదులేండి! ఇలాంటి అపార్ట్‌మెంట్లు చైనాలో ఉన్నాయి.చైనా పూర్వీకులు కూడా ప్రాచీన కాలం నుంచే వారిది అపార్ట్‌మెంట్ లైఫ్.ఈ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత సిమెంటు, ఇనుమును వాడకపోవడం.సాధారణంగా మన అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి కాంక్రీటుతోనే నిర్మిస్తారు.కానీ, అవేమీ వాడకుండా కేవలం చెక్క, మట్టి సాయంతోనే ఈ నిర్మాణాలు చేపట్టారంటే వారి నిర్మాణ నైపుణ్యం ఎంత అద్భుతం.
ప్రస్తుతం ఈ అపార్ట్‌మెంట్లలో కేవలం 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఉద్యోగరీత్యా, మారుతున్న కాలాన్ని బట్టి మిగతావారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
కానీ, ఈ అపార్ట్‌మెంట్లు మాత్రం టూరిస్టులను బాగా ఆకట్టుకుంటున్నాయి.అందుకే వీటిని చూడటానికి చాలామంది వస్తున్నారు.ప్రత్యేకంగా గుండ్రటి నమూనాలో ఉన్న అపార్ట్‌మెంట్లు వాళ్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.12వ శతాబ్దంలో బందీపోట్లు దొంగతనం కోసం ఈ గ్రామాలపై విరుచుకుపడేవారు.అందుకే ఇటువంటి నిర్మాణాలు చేపట్టారు.ఇందులో కింద ఫ్లోర్‌లో సరుకులు నింపి పెట్టుకునేవారు.ఈ అపార్ట్‌మెంట్లలో ఉండేవారు వస్తువుల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు.బందిపోట్లు దాడి చేసినా ఆ తలుపులకు ఉండే తాళాలు పగులకొట్టేందుకు వీలు ఉండేది కాదు.
పైగా వీటికి ప్రహరీ ఎత్తైనా గోడలు ఉన్నాయి.దీంతో వారు వెను తిరిగి వెళ్లిపోయేవారు.
బందిపోట్లపై ప్రతిదాడి చేసేందుకు వీలుగా ఈ గోడలు నిర్మించారు.తుపాకీ పట్టే రంధ్రాలు గోడలో ఉన్నాయి.
ఈ నిర్మాణానికి టులువ్ అని పేరు కూడా పెట్టారు.అంతేకాదు, వీరంతా ప్రస్తుతం ఒకే కుటుంబీకులు అయ్యారు.

అంటే ఒక్కో అపార్టుమెంట్లలో ఒక్కో కుటుంబం ఉంటుందన్న మాట.వారు ఒకరికొకరు తమ పిల్లల్ని ఇచ్చి పెళ్లిల్లు చేయడంతో ఇలా బంధుత్వం ఏర్పడింది.అప్పట్లో కొత్తవారు ఎవరైనా వస్తే కనీసం తలుపులు కూడా తీసేవారు కాదు.ప్రస్తుతం బందిపోటుల బెడద కూడా తగ్గడంతో టూరిస్టుల సంఖ్య పెరిగింది.దీంతో వారిని అప్యాయంగా ఆహ్వానిస్తున్నారు.ఈ ఆపార్ట్‌మెంట్ల నిర్మాణంలో వెదురు బొంగు ప్రత్యేమైంది.
అంట మనం ఇనుము వాడిన స్థానంలో వారు వెదురు బొంగులు వాడారు 3–5 అంతస్తులు నిర్మించుకున్నారు కేవలం బయట తలుపులకు మాత్రమే దృఢంగా ఉండటానికి ఇనుము వాడారు.ఇన్ని సంవత్సరాలు గడిచిన ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలిచాయంటే ఆ నిర్మాణ శైలీని కొనియాడాల్సిందే.
ఇటీవలే యూనెస్కో కూడా దీన్ని గుర్తించింది.వీటికి ఫ్యూజియన్ టులువ్ అని పిలుస్తున్నారు.