న్యాచురల్ స్టార్ నాని( Nani ) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఎప్పుడు ఈయన వస్తున్న ప్రేక్షకులు ఖచ్చితంగా కొత్తదనాన్ని ఆశిస్తారు.
నాని కూడా ఎప్పుడు ప్రేక్షకులను మెప్పించడానికి కొత్త కథలను ఎంచుకుంటూ ఉంటాడు.అయితే వరుస ప్లాప్స్ తో సతమతం అవుతున్న నానికి దసరా వంటి బ్లాక్ బస్టర్ పడింది.
ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
నాని ప్రజెంట్ తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు నాని.
ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు పోస్టర్ రిలీజ్ చేయగా అప్పుడే అంచనాలు పెరిగాయి.
మళ్ళీ నిన్న ఈ సినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
బ్యూటిఫుల్ పోస్టర్ తో టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.ఈ గ్లింప్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.”హాయ్ నాన్న”( Hi Nanna ) అనే టైటిల్ కూడా ఆకట్టుకుంది.ఇది పక్కన పెడితే నిన్న రిలీజ్ అయిన గ్లింప్స్ లో నాని కూతురుగా నటించిన చిన్నారి అందరిని అలరించింది.దీంతో ఆ పాప ఎవరు అని ఆరా తీయడం స్టార్ట్ చేసారు.
ఇంతకీ ఆ పాప పేరు ఏంటి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలుసుకుందాం.
ఆ పాప పేరు కియారా ఖన్నా.( Kiara Khanna ) ఈ పాప ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలలో బాలనటిగా చేసింది.అలాగే పలు యాడ్స్ లో కూడా కనిపించింది.
ఈమె తల్లి శివాని ఖన్నా తన పిల్లలు మైరా, కియారా తో వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటుంది.యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లలో వీరికి భారీ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్ పోషించనుండగా.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.