ఉపాసనతో కలిసి గోవాకు వెళ్లానన్న సునిశిత్.. చరణ్ ఫ్యాన్స్ ఎలా బుద్ధి చెప్పారంటే?

యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్లకు, సోషల్ మీడియా( Social Media )లో యాక్టివ్ గా ఉండేవాళ్లకు సునిశిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సెలబ్రిటీలతో తనకు పరిచయాలు ఉన్నాయని, తాను రిజెక్ట్ చేసిన సినిమాలలో స్టార్ హీరోలు నటించారని చాలా సందర్భాల్లో సునిశిత్ చెప్పుకొచ్చారు.

 Charan Fans Huge Shock To Sunishith Details Here Goes Viral In Social Media ,su-TeluguStop.com

అయితే అతని మానసిక స్థితి బాలేదని భావించి చాలామంది సునిశిత్ ఏం మాట్లాడినా పట్టించుకునే వాళ్లు కాదు.

అయితే సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఈ మధ్య కాలంలో సునిశిత్( Sunisith ) ఒకింత హద్దులు దాటి కామెంట్లు చేయగా ఆ కామెంట్లపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

ఉపాసన, సుస్మిత గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ కు బుద్ధి వచ్చే విధంగా చరణ్ ఫ్యాన్స్ వ్యవహరించడం గమనార్హం.ఉపాసన దగ్గర ఆడి ఎలక్ట్రిక్ వాహనం ఉందని ఒకసారి నేను, ఉపాసన గోవాకు వెళ్లి వచ్చామని సునిశిత్ కామెంట్లు చేయడం గమనార్హం./br>

రామ్ చరణ్( Ram charan ) నా స్నేహితుడని ఉపాసనతో చాట్ చేస్తుంటే ప్రేమలో పడేయాలని స్నేహపూర్వకంగా చెప్పాడని సునిశిత్ అన్నారు.చిరంజీవి కూతురు సుస్మితతో లాంగ్ డ్రైవ్ కు వెళ్లానని ఆయన తెలిపారు.ఈ కామెంట్లు మెగా ఫ్యాన్స్ దృష్టికి రావడంతో వాళ్లు అతనిని చితకబాదారు.సునిశిత్ చేత ఉపాసనకు ఫ్యాన్స్ క్షమాపణలు చెప్పించడం గమనార్హం.నేను చేసిన వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యలు అని సునిశిత్ అన్నారు./br>

మరోసారి ఇలాంటి తప్పుడు కామెంట్లు చేయనని ఉపాసన వదినమ్మకు, రామ్ చరణ్ గారికి క్షమాపణలు అని తప్పుడు కామెంట్లు చేసినందుకు నేను బాధ పడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.సునిశిత్ ఇలాంటివి రిపీట్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో సైతం అతనికి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.సునిశిత్ విషయంలో చరణ్ ఫ్యాన్స్ వ్యవహరించిన తీరును నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.

గతంలో పలువురు సెలబ్రిటీలను సైతం తన కామెంట్లతో సునిశిత్ ఇబ్బంది పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube