టీడీపీ అధినేత చంద్రబాబు ఏది చేసినా అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది.ఆషామాషీగా అయితే ఏ వ్యవహారాలు చేయరు.
బాబు చేసేది ముందు ఎవరికీ అర్థం కాకపోయినా, ఆ తర్వాత మాత్రం వచ్చే ఫలితాలు అందరికీ ఆసక్తి కలిగిస్తాయి.ఇప్పుడు అదేవిధంగా చేసి సక్సెస్ అవుతున్నారు బాబు.
దీంతో దేశ వ్యాప్తంగా టీడీపీ బాటను అనుసరించాలని చాలా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే స్తంభించిపోయారు.
ఆ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదు లోనే ఉండి పోవడంతో ఏపీలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి అని అనుకున్నారు.కానీ చంద్రబాబు అక్కడే తన టెక్నాలజీ బుర్రకు పదును పెట్టారు.
ఇంటి నుంచే జూమ్ యాప్ ద్వారా నిత్యం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ, మీడియా సమావేశాలు తన ఇంటి నుంచి ఈ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించడం వంటివి చేస్తూ చంద్రబాబు అందరిలోనూ ఆసక్తి రేపారు.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అన్ని ప్రతిష్టాత్మక కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
దీని ద్వారా, సమయం డబ్బు అన్నీ కలిసి వస్తుండడంతో ఈ విధానానికి ఇప్పుడు అంతా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.తెలుగుదేశం పార్టీని కూడా ఆ టెక్నాలజీ పాట పట్టించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు దానికి తగ్గట్టుగా కసరత్తు చేసి సక్సెస్ అవుతున్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి ఎక్కువగా కనిపిస్తోంది.గతేడాది దీనిని నిర్వహించాల్సి ఉన్నా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేశారు.అంటే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలతో సభలకు అనుమతి ఇచ్చే అవకాశం లేకపోవడంతో జూన్ యాప్ ద్వారానే మహానాడును నిర్వహిస్తున్నారు.పార్టీ శ్రేణులంతా జూన్ యాప్ ద్వారా , యూట్యూబ్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా మహానాడును వీక్షిస్తున్నారు.
ఈ సరికొత్త విధానంలో తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తిని కలిగించింది.
నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, సమయాన్ని ఆదా చేసే విధంగా చంద్రబాబు చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగానికి అందరూ ఫిదా అవుతున్నారు.
రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగానే సభలు సమావేశాలు నిర్వహించేందుకు మొగ్గు చూపిస్తున్నాయి.ఏది ఏమైనా టెక్నాలజీ పేరు చెబితే చంద్రబాబు అప్పటికీ, ఇప్పటికీ అందరికీ గుర్తొస్తున్నారని తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు.