ఇటీవల పొరుగుదేశం పాకిస్థాన్ నుంచి ఒక పావురం కాశ్మీర్ లో కలకలం రేపింది.అయితే అప్పుడప్పుడు పాక్ భారత్ పై గూఢచర్యం కోసం అని పావురాలను పంపిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే ఈ పావురం కాశ్మీర్ లో కనిపించడం దానిపై గులాబీ రంగు ఉండడం,కాలికి రింగ్ ఉండడం,దానిపై నంబర్ ఉండడం ఇలా అన్నీ చేర్చి అది గూఢచర్యం కోసమే పాక్ నుంచి వచ్చినట్లు అధికారులు భావించారు.దీనితో ఆ పావురాన్ని అదుపులోకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.
అయితే సరిగ్గా ఈ సమయంలో ఈ పావురం విషయం అనుకోని ట్విస్ట్ వచ్చింది.ఆ పావురం నాది అని, నా పెంపుడు పావురం…నా పావురాన్ని నాకు ఇప్పించండి అంటూ పాక్ కు చెందిన ఒక యువకుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కే విజ్ఞప్తి చేశాడు.
ఆ పావురానికి, పాక్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అది గూఢచారి పావురం కాదంటూ సరిహద్దులోని పాక్ గ్రామానికి చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు.తన పావురం తనకు ఇప్పించాలని కోరుతున్నాడు.
ఆ పావురం తనదేనని, పావురం రింగుపై ఉన్న నంబరు తన ఫోన్ నంబర్ అని అతడు చెబుతున్నాడు.
తన పావురాన్ని తనకు అప్పగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాడు.
అయితే నిజంగా ఆ పావురం ఆ యువకుడిగా లేదంటే దొరికిపోయిన కారణంగా ఇలా కవర్ చేసుకుంటున్నారో అన్న విషయం పై క్లారిటీ లేదు.మొత్తానికి ఆ పావురం ఆ యువకుడి దా లేదంటే పాక్ గూఢచర్యం కోసం పంపిన పావురమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.