తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసింది.నిన్న మహిళలతో సమావేశమైన చంద్రబాబు నేడు కుప్పం యువతతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జరగబోయే ఎన్నికలలో లక్ష మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు.తెలుగుదేశం పార్టీ కూటమీ అధికారంలోకి వచ్చాక అమరావతి( Amaravati )ని రాజధానిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
పులివెందులకు జగన్ కంటే తానే ఎక్కువ అభివృద్ధి చేయటం జరిగిందని నీళ్ళు తెచ్చింది కూడా తానే అని చంద్రబాబు తెలిపారు.తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం పెడతామని చంద్రబాబు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.
అనంతరం హంద్రీనీవా సుజల శ్రవంతి కెనాల్( Handri Neeva Sujala Sravanthi Canal ) ను చంద్రబాబు పరిశీలించడం జరిగింది.పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్( CM YS Jagan ) పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.జగన్ ప్రభుత్వం పెండింగ్ పనులను 10 శాతం కూడా పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు.ఆనాడు సినిమా సెట్టింగ్ మాదిరిగా బటన్ నొక్కి విమానం ఎక్కి వెళ్ళిపోయారు.
ప్రాజెక్టుల విషయంలో ఇంత గొప్ప యాక్టర్ లు ఉంటారని.ఎవరు అనుకోరు.
ఈ ముఖ్యమంత్రి మొత్తం డ్రామాలు ఆడుతున్నారు.ఈ డ్రామా కంపెనీ ఐదేళ్లు నడిపారు.
ఇప్పుడు కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు.తొందర్లోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీ మూసేసి.
రాష్ట్రాన్ని వీళ్ళ నుండి విముక్తి చేస్తాను అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.మళ్లీ ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్రలో కుప్పంకి రావడానికి రెడీ అవుతున్నారు.
అంటూ ప్రశ్నించారు.