సుప్రీంలో ఓటుకు నోటు ! బాబు అప్పుడు బుక్కవుతాడా ...?

అప్పట్లో టీడీపీని ఒక కుదుపు కుదిపి చంద్రబాబు అకస్మాత్తుగా కరకట్టకు వెళ్లేలా చేసిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.తెలంగాణ, ఆంధ్రాలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం మళ్ళీ మొదలు కావడం సంచలనం సృష్టిస్తోంది.

 Chandrababu Naidus Vote For Note Case Reopens In Supreme-TeluguStop.com

ఈ ఓటుకు నోటు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.ఈ కేసును సీబీఐ చేత విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.

రాజకీయ కక్షతో వేసిన ఈ కేసును విచరణకు తీసుకోవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టును కోరారు.అయితే, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మల్యేకు డబ్బు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించినట్లు ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు వాయిస్ రికార్డును కూడా ఫోరెన్సీక్ ధృవీకరించిందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగ్గా విచారించడం లేదని, కాబట్టి సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోర్టును కోరారు.

అయితే, ఎన్నికల కారణంగా ఈ కేసును విచారణకు స్వీకరించవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది కోర్టును కోరగా, ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది.ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ పేర్కొన్నారు.ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్‌ మదన్‌బీ లోకూర్‌.ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube